Saturday, February 14, 2026
spot_img
HomeSouth ZoneTelanganaయువత సన్మార్గంలో పయనించాలి

యువత సన్మార్గంలో పయనించాలి

జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ శిబిరం తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ:— ప్రస్తుతం ఏ రంగం చూసిన యువతదే ప్రధాన పాత్రఉంటుందని, అలాంటి యువత దేవుడు సూచించిన సన్మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా,వైద్య,రాజకీయం… ఇలా అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధిని సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని వారిని నిత్యం పూజించాలని, గౌరవించాలని. జూదం,ల్లో మట్కా, గంజాయి, మద్యంల్లోఇలాంటితు చెడు వ్యాసనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేయకుండా ఉండాలని సూచించారు. ముగిసిన తరగతులు…. యోగ సాధానతో అన్ని రోగాలను అధిగమించవచ్చని పూజ శ్రీ బసవలింగ అవధూత పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తగిలి వచ్చారు. శిక్షణ తరగతులు సాగిన ఐదు రోజులపాటు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments