మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల కూటమి నేతలకు ఆత్మీయ విందు ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యులతో సాగిన ఈ భేటీలో లోకేశ్ స్వయంగా అతిథులకు స్వాగతం పలికారు. నియోజకవర్గ సమస్యలపై ఇచ్చిన వినతుల పురోగతి నివేదికలను నేతలకు అందజేయడమే కాకుండా, మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహుకరించారు.
ఈ వినూత్న పారదర్శక విధానం, ఆత్మీయతపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.




