పల్లిపేటలో అగ్నిప్రమాదం: ఇల్లు పూర్తిగా దగ్ధం

0
0

కాకినాడ జిల్లా కరప మండలం పల్లిపేటలో శుక్రవారం గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టంతో పాటు వలలు, నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం తప్పింది.

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.