మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామి వార్లకు మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం శనివారం పట్టు వస్త్రాలను సమర్పించింది.
మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చిన ప్రతినిధులు, చేనేత కళాకారులు రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు పలువురు కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.









