ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు

0
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు శనివారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ (IAS), కార్యదర్శి రోనాల్డ్ రోస్ (IAS) నేతృత్వంలోని బృందం బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా సాగాలని అధికారులు ప్రార్థించారు.

ఆలయ ఈవో శీనా నాయక్ అధికారులకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.