ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర వికాసానికి దిక్సూచి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు.
రాజధాని అమరావతికి రూ.57,000 కోట్లు, వ్యవసాయానికి రూ.53,752 కోట్లు కేటాయించడం శుభపరిణామన్నారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో ఈ బడ్జెట్ సమతుల్యత పాటిస్తోందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి ఇది గట్టి పునాది అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.










