మదనపల్లెలో సంచలనం సృష్టించిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు తాజాగా పదో నిందితుడు (A10) నార్ల వెంకటేశ్వర్లు (47)ను అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఇతడు గత ఏడాది నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఆంజనేయులు సహా తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిడ్నీ దాతలు, గ్రహీతలను సమకూర్చడంలో వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించినట్లు డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు.










