విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో మిరుమిట్లు గొలిపాయి. శ్రీ కనకదుర్గమ్మ కొండ శివనామస్మరణతో సాక్షాత్తు కైలాసాన్ని తలపించింది.
ఆదివారం రాత్రి ప్రారంభమైన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్ధరాత్రి వేళ జరిగిన లింగోద్భవ కాల విశేష పూజలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ దంపతులు, చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. విద్యుత్ దీపాల అలంకరణలు, పటిష్టమైన భద్రత నడుమ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.










