బోయకొండలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: 9 మంది అరెస్ట్

0
0

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు.

ఈ దాడిలో తొమ్మిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1,78,200 నగదు, 9 సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారు మదనపల్లెతో పాటు కర్ణాటకలోని బెంగళూరు, ముల్బాగల్ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

# కొత్తూరు మురళి.