ముల్కనూర్ వద్ద స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: త్రుటిలో తప్పిన ప్రమాదం

0
0

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ వద్ద సోమవారం ఉదయం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సుమారు 60 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.