రామసముద్రం మండలం మినికి గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. రైతులకు చెందిన మామిడి తోటలో మంటలు చెలరేగి తోట, కంచె దహనమయ్యాయి. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఎవరో పడేసిన నిప్పుపుల్ల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి సుబ్బరాజు తెలిపారు. తోటల వద్ద నిప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించారు.










