కురబలకోట వద్ద ప్రమాదం: ముగ్గురు భవన కార్మికులకు తీవ్ర గాయాలు

0
0

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై మదనపల్లెకు పనుల నిమిత్తం వెళ్తున్న ముగ్గురు భవన కార్మికులను కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కరీముల్లా, అక్బర్, సౌకత్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులు పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.