మదనపల్లె కలెక్టరేట్‌లో దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడుతూ..
పేదరికంలో పుట్టి దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఏపీ రెండో సీఎం, కేంద్ర మంత్రిగా నిష్కళంకమైన సేవలందించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సంజీవయ్య చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.










