మారెమ్మ అర్ధనారీశ్వరి అలంకారం: పుంగనూరులో శివరాత్రి సంబరాలు

0
0

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు.

అమ్మవారు అర్ధనారీశ్వరుని రూపంలో భక్తులకు అద్భుత దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు జరిగాయి. శివ-శక్తుల ఐక్యతకు చిహ్నమైన ఈ అలంకారాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పట్టణమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

# కొత్తూరు మురళి.