ఖానాపూర్ మున్సిపల్ కేంద్రంలో ఎస్పీ తనిఖీ

0
0

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎన్నిక కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించిన ఆమె, భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు కీలక సూచనలు చేశారు.

ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం పట్టణంలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది.

# saketh