మదనపల్లెలో హ్యాండ్లూమ్ దుకాణం దగ్ధం: రూ. 5 లక్షల నష్టం

0
0

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి పూజ కోసం వెలిగించిన దీపాల వల్ల రవీంద్రారెడ్డికి చెందిన హ్యాండ్లూమ్ దుకాణంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో దుకాణంలోని వస్త్రాలు, సరుకు పూర్తిగా కాలిపోయి సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.