విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాల పండగ

0
0

విశాఖపట్నం సాగర తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

రేపు (ఫిబ్రవరి 18) ఆమె యుద్ధనౌకల విన్యాసాలను తిలకించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రులు రేపు ఉదయం విశాఖకు చేరుకోనున్నారు. సుమారు 50 దేశాల నుండి 70కి పైగా యుద్ధనౌకలు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొని తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి.