అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులకు మేలు చేసేందుకు జేసీ శివనారాయణ శర్మ సోమవారం రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను పంపిణీ చేశారు.
జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందని, నాణ్యమైన దిగుబడి కోసం బేనిషాన్, రసాలు వంటి రకాలకు కవర్ల వినియోగం అవసరమని ఆయన పేర్కొన్నారు. మదనపల్లె కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు పాల్గొని రైతులకు వీటిని అందజేశారు.










