పుంగనూరులో సోమవారం సాయంత్రం ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. పలమనేరు నుండి మదనపల్లె వెళ్తున్న పల్లె వెలుగు బస్సు డ్రైవర్ రమేశ్, ప్రయాణంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రాణాపాయ స్థితిలోనూ ఆయన అప్రమత్తంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోవడంతో, అందులోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కండక్టర్ భానుమతి వెంటనే స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
# కొత్తూరుమురళి.









