ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రం గ్రామంలో విషాదం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతుండగా, అది అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే బాలుడు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు వెంటనే స్పందించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









