ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురంలో పొలం వివాదం అన్నదమ్ముల మధ్య రక్తపాతానికి దారితీసింది. భూమి గొడవలో అన్న నాగులయ్య బాణం అంబుతో దాడి చేయగా, తమ్ముళ్లు నాగేంద్ర, యేసు తిరుమలయ్య గాయపడ్డారు.
తిరగబడిన తమ్ముళ్లు కర్రలతో కొట్టడంతో నాగులయ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









