మదనపల్లెలో బాలిక హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ బిడ్డను ఎంత దారుణంగా చంపాడో, నిందితుడిని కూడా అలాగే వెంటనే చంపాలని బాలిక బంధువులు మంగళవారం డిమాండ్ చేశారు.
ఎస్పీ సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని అప్పగించబోమని స్పష్టం చేశారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటామని బాధితులు విలపిస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.









