మదనపల్లె మండలం కొత్తవారిపల్లిలో సోమవారం ఘోరం జరిగింది. వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఎశ్విన్పై చంద్ర అనే వ్యక్తికి చెందిన వేట కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి.
ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెంపుడు కుక్కల యజమానుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










