రాయచోటిలో ‘మై టీడీపీ’ (My TDP) యాప్ పోస్టర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గం అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, కసినేని మహేంద్ర నాయుడు, చెన్నూరు బాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










