పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మే, జూన్ నెలల్లో ఈ అసెంబ్లీల గడువు ముగియనుండటంతో, పారదర్శకమైన నిర్వహణకు ఈసీ చర్యలు చేపట్టింది.
