మదనపల్లెలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల చిన్నారి రిషిక కుటుంబాన్ని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు బుధవారం పరామర్శించారు.
చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, వారికి పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన పోలీసులను విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.









