బాపట్ల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ సూచనల మేరకు కేవీకే ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆర్డీవో పి. గ్లోరియా క్రీడలను ప్రారంభించి, చెస్ విద్యార్థులలో ఏకాగ్రతను, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు డిసెంబర్ 21న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు వెల్లడించారు.
#Narendra










