చీరాల: డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు |

0
0

చీరాల సంఘం థియేటర్ రోడ్డులో ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిన గోమాతను స్థానికులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా రక్షించారు.

చీమకుర్తి బాలకృష్ణ సమాచారంతో సకాలంలో స్పందించిన సిబ్బంది, ఆవును బయటకు తీసి వైద్య పరీక్షలకు తరలించారు. స్వల్ప గాయాలతో ఆవు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మూగజీవిని కాపాడిన ప్రతి ఒక్కరినీ స్థానికులు అభినందించారు.

#Narendra