బాపట్ల జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. భీమవరం అంగన్వాడీ కేంద్రంలో ఇంకొల్లు సీడీపీఓ సులోచన రాణి చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు ఈ మందు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
1 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఈ మాత్రలు అందేలా చర్యలు తీసుకున్నారు.
#Narendra









