అనంతపురం గంగమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
రాయలసీమ నలుమూలల నుండి ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొన్నాయి. మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్రథమ బహుమతిగా రూ. లక్ష, ద్వితీయ బహుమతిగా రూ. 80,000 అందజేశారు. ఈ వేడుకలో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.










