ఘనంగా శివాజీ జయంతి: ఆటో డ్రైవర్ల సేవలను అభినందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
1

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా, ఆటో నడుపుతూ జీవనం సాగించే సేవా సమితి సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని అన్నదాన కార్యక్రమాలకు వెచ్చించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాప్‌ల వద్ద వారు చేస్తున్న నిరంతర సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రవి నాయక్, గోపాల్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Sidhumaroju
Alwal