శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో అవకతవకలు జరిగాయన్న వైసీపీ ఆరోపణలను టీటీడీ, హెరిటేజ్ ఫుడ్స్ తీవ్రంగా ఖండించాయి.
నిరాధార ఆరోపణలు చేసినందుకు బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ లీగల్ నోటీసు పంపింది. మొత్తం టెండర్లలో 62% వాటా నందిని (KMF) సంస్థదేనని, కేవలం 15% మాత్రమే ఇందాపూర్ డెయిరీకి దక్కిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
నాణ్యత కోసమే కొత్త సంస్కరణలు తెచ్చామని, ధరల నిర్ణయం పారదర్శకంగా జరిగిందని ఆయన వెల్లడించారు.










