విజయవాడ గురునానక్ కాలనీలో రూ. 1.48 కోట్ల విలువైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గత వైసీపీ కౌన్సిల్ నగర అభివృద్ధిని అడ్డుకుందని, కొత్త కౌన్సిల్‌తో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
కాలుష్య రహితంగా, తక్కువ సమయంలోనే ఈ యంత్రంతో రోడ్ల గుంతలను పూడ్చవచ్చని ఆయన పేర్కొన్నారు.










