హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|

0
0

మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా :  ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ‘జావేద్ హబీబ్’ (Javed Habib) మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రేమ్, శోభన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జావేద్ హబీబ్ బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

గత ఏడాది కాలంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందడం అభినందనీయమని, భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెలూన్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal