కూటమి ప్రభుత్వానికి రిషిక ప్రియ తల్లిదండ్రుల కృతజ్ఞతలు

0
1

మదనపల్లెలో అమానుషంగా హత్యకు గురైన చిన్నారి రిషిక ప్రియ తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి గురువారం కృతజ్ఞతలు తెలిపారు.

కష్టకాలంలో ధైర్యం అందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, లోకేష్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. “ఆ క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని ఆవేదనతో వ్యాఖ్యానించిన వారు, అంతిమ సంస్కారాలకు సహకరించిన పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.