చీరాలలో రూ.4.5 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ |

0
1

చీరాల జయంతిపేటలో రూ.4.5 కోట్లతో నిర్మించనున్న 33/11 KV విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సబ్‌స్టేషన్‌తో జయంతిపేట, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో లో-వోల్టేజ్, విద్యుత్ కోతల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వ సోలార్ సబ్సిడీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Narendra