బాపట్లలో డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

0
0

బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి డిఎస్పి జగదీష్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థినులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గంజాయి లేదా డ్రగ్స్ సమాచారం ఉంటే 1972 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ హరిత, విద్యార్థినులు పాల్గొన్నారు.

#Narendra