సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ అమలకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2,000 మంది భక్తులకు 11 రకాల ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు.
ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఈ వితరణను ప్రారంభించగా, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.










