మదనపల్లిలో భూ విక్రయం పేరుతో జరిగిన ₹60 లక్షల మోసం కలకలం రేపింది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, తన భార్య లక్ష్మీదేవి పేరుతో రెండు ఎకరాల భూమి కోసం 2022లో అగ్రిమెంట్ చేసుకున్నట్లు బాధితుడు తెలిపారు.
అయితే, కే. అమర్నాథ్ అనే వ్యక్తి డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా, తిరిగి అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని బాధితుడు ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.










