మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

0
0

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్న 24 కిలోల బాక్స్ గరిష్టంగా ₹320 పలకగా, నేడు కేవలం ₹250కి చేరింది. ఒక్కరోజులోనే ధరలు తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో రవాణా ఖర్చులు కూడా భారమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.