రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణం

0
0

బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనపర్తికి చెందిన యువ అధ్యాపకుడు కోకా దినేష్ (25) మృతి చెందారు. ఆదిత్య కళాశాల పనిమీద సూరంపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. త

లకు తీవ్ర గాయమవడంతో అనపర్తి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూశారు. పాలకొల్లులో లెక్చరర్‌గా పనిచేస్తున్న దినేష్ అకాల మరణంతో అనపర్తిలో విషాదం నిండింది. బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.