కల్లూరు మృతుడి గుర్తింపు: అనకాపల్లి వాసిగా రాము గుర్తింపు

0
0

పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు ఛేదించారు. మృతుడు అనకాపల్లి సమీపంలోని లక్ష్మీదేవిపేటకు చెందిన అడారి రాము (46) గా ఎస్సై వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు.

సుమారు 15 ఏళ్లుగా స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్న రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.