సామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు మృతి చెందారు.
మాధవపట్నం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని జేసీబీ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొండలరావు, చికిత్స పొందుతూ మరణించారు.
సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.










