పెద్దపంజాణి మండలం రాసిపల్లిలో భూ వివాదం నేపథ్యంలో దాడికి గురై, పుంగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంగమ్మ, సరస్వతమ్మలను రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు ఎన్ఆర్ అశోక్ పరామర్శించారు.
బాధితులకు ధైర్యం చెప్పిన ఆయన, మహిళలపై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటం అమానుషమని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
# మురళి.










