సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల సమ్మె గురువారం ఉధృతమైంది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక బ్రాంచి కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు.
వేతన సవరణ, పదోన్నతులు, సేవా నియమావళి సవరణ వంటి పెండింగ్ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులకు దూరంగా ఉంటామని కోరాడ మారుతీ బాబు, గుర్రాల వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ ఆందోళనలో పలువురు యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.










