డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఏ-2 నిందితురాలిగా చేరుస్తూ సిట్ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. హత్యకు ప్రేరేపించడం, ఆధారాల ధ్వంసంలో ఆమె పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణను నవంబర్ 2026 లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. నిందితురాలిగా చేర్చిన నేపథ్యంలో లక్ష్మీదుర్గ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.










