పుంగనూరులో ఘోర ప్రమాదం: కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

0
1

పుంగనూరు శాంతినగర్ సమీపంలో కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మేఘమాల పరిస్థితి విషమంగా మారింది. రోడ్డు దాటుతున్న సమయంలో మదనపల్లె నుంచి వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు పుంగనూరు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వైద్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

# కొత్తూరు మురళి.