ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్

0
0

కాకినాడ నరసన్ననగర్‌లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను నగర కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక, సామాజిక వివరాలను పక్కాగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరవేసేందుకు ఈ సర్వే కీలకమని, ప్రజలు సిబ్బందికి సహకరించాలని కోరారు.

ఈ వివరాల ఆధారంగానే భవిష్యత్తులో సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఖచ్చితమైన సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.