మదనపల్లె బాలిక హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ తల్లి అంజలిపై వేటు పడింది. వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న ఆమెను విధుల్లో నుంచి తొలగిస్తూ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘోరకలిలో ఆమె పాత్రపై పోలీసులు కేసు నమోదు చేసి ఏ-2 నిందితురాలిగా చేర్చారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.










