మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.

0
1

మదనపల్లె మండలం పనసమాకులపల్లెలో రైతు దంపతులపై ప్రత్యర్థులు దారుణంగా దాడి చేశారు. ఆవులు పొలంలో పడ్డాయనే సాకుతో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని శంకర, ఆదిలక్ష్మిలను కర్రలతో బాదారు.

ఈ దాడిలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పొన్నేటిపాళ్యం పోలీసులు విచారణ ప్రారంభించి, నిందితుల కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో ఇలాంటి గొడవలు కలకలం రేపుతున్నాయి.